Sunday, June 20, 2010

నీవే నాకు ప్రాణం !!

నీవూ, 
నా నీడవై.. నాకు తోడువై..
నిదురించే కళ్ళలోని కనుపాపవై.. 
గుండె గుడిలోని ప్రేమ దేవతవై..


నీవే కలవై, కలలోని నిజమువై..
నా శ్వాసవై, శ్వాసలోని ఆశవై
నీవూ నా ప్రాణమువైనావూ...





Thursday, March 5, 2009

నిను నిలువరింప నా తరమా ?

తూరుపు కొండనెక్కి
చీకటిని
తరిమి తరిమి కొడుతూ
చల్లని గుండెని ముక్కలు చేసి..
అడ్డువచ్చిన పొగ మంచుని నిలువునా మింగి..
తమలో
దాచేయాలని ప్రయత్నించిన,
తరుల చిగురుటాకులాపై ముత్యాల హరివిల్లుని ఆవిరి చేసి..
నీ వికటాట్టహాసపు అందాన్ని కొలనులో చూసి మురిసిపోతూ..

నీ
వలపుల బాణాలతో నా గుండెని గుచ్చి,
నిదురపోతున్న
నా చెలి తలపులని
తట్టి
లేపనిదే నీకు తెలవారదేమో.. . ?

Saturday, February 28, 2009

నీ తోడూ !! (U R my LIFE)

నా కలల చీకటిని తరమగా,
ప్రమిదవై
వస్తావో.. లేక,
కలలనే దహించగా,
ప్రలయాగ్నివై వస్తావో.. ?

నా
మనసును సేద తీర్చగా,
పిల్లతెమ్మరై వస్తావో.. లేక,
గుండె గూడునే కూల్చే,
సుడిగాలివై
వస్తావో.. ?

నా ఆశలకు జీవం పోయగా,
వర్షపు
చినుకై వస్తావో.. లేక,
ఆశల వేరునే కబళించే,
జడి
వానవై వస్తావో.. ?

నా బ్రతుకు నావని దరికి చేర్చగ,
నిశ్చల సంధ్రమవుతావో.. లేక,
నావని నిలువునా ముంచే,
కెరటమవుతావో.. ?

నా అడుగుకు ప్రతి అడుగు కలిపగా,
నీడవవుతావో..
లేక,
నీడనే సమాధి చేసే
సమిధవవుతావో
.. ?

Wednesday, February 25, 2009

నీ అందాలను తడమగా, ఎంత అదృష్టమో కదా..? (Lucky Drop)

నీ కురులపై జాలువారిన ఆ నక్షత్రం,

నీ మోముపై చేరి పసిడి కాంతులీనేను..

ఎర్రని నీ అధరాలపై మోజుపడిపసిడి భ్రమరం,
ఆ తేనెల మధువులో జలకాలడెను..

ఆ మత్తు ఏ గమ్మత్తు చేసెనో, 
నీ ఎదపైకి చేరిన నర్తకి,
గుండె సవ్వడికి లయబద్దంగా శృంగార నాట్యమాడెను..

నీ గుండె తలపులు తనలో ఏ వేడి పుట్టించెనో,
ఆ తేనేల దొంగ నీ నడుమోంపున చేరి సేద తీరెను..

నీ క్రీగంట కొన చూపుని తప్పించుకోలేని నీటిబిందువు,
నీ పాదాలపైకి జారి కొంటెగా నవ్వుతూ ముద్దాడెను...

ఆ నవ్వున ఏ భావము దాగెనో కదా..?
నీ అందాలని ఆస్వాదించానన్న గర్వమా..?
లేక తనను పునీతం చేసావన్నఆరాధనా..?

నీ పేరు!!

నీ పేరు తలిచినంతనే,
నా కళ్లు చెమర్చనే !
కన్నీళ్ళని నే దాచినా,
గుండె ఉప్పెనని నే ఆపలేకున్నా!!

ఏ నోట నీ పేరు పలికిన,
అది నీ సొంతమని..
నా మనసు మౌనంగా,
నాతో పోరుపెడుతున్నది..
నా పెదవులపై నే అద్దుకున్న
నా చిరు నవ్వు.. !
ఆ ఉప్పెనని, ఈ పోరుని
గెలవలేక పాలి(రి)పోతున్నది.. !!

Wednesday, February 18, 2009

ప్రపంచం పరుగెడుతోంది !! (Lost in this WORLD)

పరుగుల ప్రపంచం పరుగెడుతోందీ..
నేనూ పరుగెడుతున్నాను...
రంగుల లోకం కొంగొత్త రంగులు పులుముకుంటోంది..
నేను ఆ రంగులూ పులుముకొన్నాను..
కాలం వంకలో మలుపులన్నీ తిరుగుతోందీ,
నేను ఆ మలుపుల్లో చేరాను..


ప్రపంచం పరుగెడుతూనే ఉంది..
నేను పరుగెడుతూనే ఉన్నాను..


ఆ మలుపుల్లో,
ఏ ముల్లోగుచ్చినట్టూంది..
నే పరుగాపాను... కాదు.. కాదు..

నే నడవలేకపోతున్నా..

కాని మనసులేని ప్రపంచం వెనుతిరిగి చూడలేదు..
అది నను ఒంటరిని చేసి వెళ్ళిపోతోంది..


నా దారులన్నీ ఇలా విడిపోయాఎమీ ?
నువ్వెక్కడ? - అని నా గమ్యం వెకిలిగా నవ్వుతున్నదేమీ
నా వ్యక్తిత్వం అలా నా నీడని వదిలి వేలుతున్నదేమి ?
నీవెవరు? - అని నా మనో రూపం హేళనగా చుస్తున్నదేమీ


ఆ ప్రపంచం వదిలిన నీలి నీడన
నే స్తానువునయ్యాను..
కానీ, అలుపులేని ఆ ప్రపంచం
ఇంకా పరుగెడుతూనే ఉంది..

నీ జ్ఞాపకం !! (Walking with Your Memory)

నా చేతిలోన నీ చేయి లేదు..
అయినా, నా దారి మారలేదు..

నా అడుగులకి నీ పాదాల తోడూ లేదు..
అయినా, నా నడక ఆగలేదు..

నా కనుపాపకి నీ రూపు చూపు లేదు..
అయినా, ఆ వెలుగు తగ్గలేదు..

నా మాటలకి నీ నవ్వుల ఝరి లేదు..
అయినా, నా పెదవి ముడుచుకోలేదు..

నీవు నిజమై నను కరునించకున్నా,
జ్ఞాపకమై నను మురుపిస్తున్నావే, ప్రియా.