Sunday, March 30, 2008

నిదుర !!

ప్రియా.. నీ ముఖ పరిచయం లేదు కానీ, నీ రూపం నా గుండెని తడుముతున్నది !
ఆ ఆనవాలని బంధించాలని, కనులను మూయగ నిదురే దరి చేరుతున్నది !! :-)

Sunday, March 23, 2008

జీవితం!! (ప్రియురాలు మోసం చేసిందని ఆత్మహత్య అనే వార్త మీద)

మిత్రమా, జీవితం అంత విలువ లేనిదా.. ?
అమ్మ పాల అమృతాన్ని దాచుకున్నది ఈ జీవితం..
నాన్న ఆశల ఉపిరులు పోసుకున్నది జీవితం..
ఎన్నో బంధాలను అల్లిన మనసులతో ముడిపడినది ఈ జీవితం..

నీకు గుర్తుకు లేవా మిత్రమా,
నీవు కలలుగన్న జీవితపు మధురాను భావాలు, నిర్మించుకున్న కలల సౌధాలు..
నీకు తెలియదా మిత్రమా
జీవితపు ప్రయాణంలో ఎత్తు పల్లాలూన్టాయని.. రేయింబవళ్ళు ఉంటాయని..
తెలిసీ చిన్నగాలివానకు బెదిరిన మనసుకి, నీ ప్రాణాలను సమాదానమిచ్చావా..?

Wednesday, March 19, 2008

పదాల నేర్పు - సంగీతం -- ప్రయత్నం 2

వినీలాకాశంలో విహరించే మేఘాలకు మెరుపలనద్దినదీ, సంగీతం..
చినుకు చినుకు కలిసి సృష్టించే ప్రవాహపు జడి, సంగీతం...
తరులలో కలిగిన అలజడితో జత కలిసి పయనించునది, సంగీతం....

Tuesday, March 18, 2008

పదాల నేర్పు - ఎదురుచూపు -- ప్రయత్నం1

నీకోసం వేచి యున్న కనులకేమి తెలుసు నీవు రావని...
అలలా ఎగసి అలసిన నా మనసుకేమి తెలుసు ఊరడించే చెలి(మి) లేదని ...
కాలం లోగిలిలో ఇది కలగా మిగులుతుందన్న ఆశతో ఎదురు చూస్తునే ఉంటా....