Sunday, November 30, 2008

సమయం !!

రేపటికి రూపు లేదు.. చేజారిన క్షణాలు నీవి కావు !
నీతో సాగుతున్న నిముషాలే, నీ భవిష్యత్తుకు రథచక్రాలు !! --->1
గడిచిన కాలానికి బంధివి కావొద్దు !
నీ ఈ క్షణాలతో నిర్మించిన సౌధాలని,
రాబోయే కాలానికి బహుమతిగా ఇవ్వు !! ---> 2

ఉగ్రవాదం !!

అమాయకుల రక్తంతో తడిసి పునీతమవుతోన్నదా, నీవు నమ్మిన సిద్ధాంతం ?
ఆ ఆర్తనాదాల్లో వినపడుతోందా, నీవు కోరుకున్న రాజరికపు రాజసం ?

గుండె పగిలి కన్నీళ్ళుగా మారుతున్నా, ఆ గొంతులో ఆర్ద్రత నీ మనసును కరిగించటం లేదా ?
ఏమి సాధించాలని, నీ ఈ వెర్రి చర్యలు ?

నీ వల్ల మనిషే మనిషికి శత్రువవుతున్నాడు
మానవత్వమే మనసులకు దూరమవుతున్నది !!

Friday, November 28, 2008

పయనం !!

నీతో సాగుతున్న పయనంలో..
దూరాలు తరుగుతున్నాయి...
సమయాలు కరుగుతున్నాయి....
నడిచిన దారులు కొత్తగా పలకరిస్తున్నాయి.... !!

Tuesday, November 18, 2008

చీకటి !!

నడి రేయి నిదురలోన నా మనసు నీతో విహరిస్తున్నది !
అది నిజమని నమ్మి నా కనులు తెరిచి చూడగా, చీకటే పలకరిస్తున్నది !!

Sunday, November 9, 2008

ఉప్పెన!!

గుప్పెడంత గుండెకేమి తెలుసు, నేను అందంగా లేనని,
ఊహల ఉప్పెనకేమి తెలుసు, అవి పెదవి దాటలేవని,
పెదవి మాటున అదిమిన ఆ ఉప్పెన కన్నీళ్ళుగా పొంగితే, నేనేమి చేసేది ప్రియతమా.. !

Friday, November 7, 2008

ఓ ప్రేమ!!

ఓ ప్రేమ,
నేలపై విహరిస్తున్న నా మనసుకి,
ఆశల రెక్కలు తొడిగి ఆకాశాన్నందుకోమన్నావ్ !
సంశఇంచిన నా గుండె లయకి,
బాసటగా స్నేహ హస్తాన్ని అందించావ్ !!

ఘడియలని నిమిషాలుగా, ఆ నిమిషాలని
నా గుండె సవ్వళ్ళతో ఏకం చేస్తానని నమ్మించావ్ !

కానీ, కాలంతో పోటి పడలేక, నా హృదయ సాగరాన్ని మేల్కొలిపి,
ఆ అలలల్ని నా కళ్ళల్లో నింపావ్ !!