తూరుపు కొండనెక్కి
చీకటిని తరిమి తరిమి కొడుతూ
ఆ చల్లని గుండెని ముక్కలు చేసి..
అడ్డువచ్చిన పొగ మంచుని నిలువునా మింగి..
తమలో దాచేయాలని ప్రయత్నించిన,
ఆ తరుల చిగురుటాకులాపై ముత్యాల హరివిల్లుని ఆవిరి చేసి..
నీ వికటాట్టహాసపు అందాన్ని కొలనులో చూసి మురిసిపోతూ..
నీ వలపుల బాణాలతో నా గుండెని గుచ్చి,
నిదురపోతున్న నా చెలి తలపులని
తట్టి లేపనిదే నీకు తెలవారదేమో.. . ?
Thursday, March 5, 2009
Subscribe to:
Posts (Atom)