దేవుని గుడిలో ఆడిన తొక్కుడు బిళ్ళ.. నాలుగు స్తంభాలాటలు..
పెరటిలోన వేసిన బొమ్మరిల్లులు.. చేసిన బొమ్మల పెళ్ళిళ్ళు ..
తోటల్లోన చేసిన దొంగతనాలు.. కాకి ఎంగిల్ల్లుల పంపకాలు ..
కలిసి కట్టుగా బడి వైపు సాగిన పయనాలు .. దారి పొడవునా ఆనందపు పరవళ్ళు ..
ఐస్ క్రీమ్ కోసం నానమ్మ దగ్గర చేయి చాసిన క్షణాలు .. కేరింతలు ..బుంగమూతులు ..అలకలు ..
తాతయ్యతో కలిసి నిదురించిన రాత్రిళ్ళు .. పురాణాలు , నీతి కథలతో సహవాసాలు ..
ఆరు బయట పడకలు .. అంత్యాక్షరిలు ... నక్షత్రాల లెక్కింపులు..
చందమామతో కబుర్లు.. చల్లగాలితో ఊసులు ...
రేపటి(భవిష్యత్తు) ఆలోచనలతో కమ్ముకువచిన నిద్ర తెరలో సేద తీరిన వైనాలు...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment