పరుగుల ప్రపంచం పరుగెడుతోందీ..
నేనూ పరుగెడుతున్నాను...
రంగుల లోకం కొంగొత్త రంగులు పులుముకుంటోంది..
నేను ఆ రంగులూ పులుముకొన్నాను..
కాలం వంకలో మలుపులన్నీ తిరుగుతోందీ,
నేను ఆ మలుపుల్లో చేరాను..
ప్రపంచం పరుగెడుతూనే ఉంది..
నేను పరుగెడుతూనే ఉన్నాను..
ఆ మలుపుల్లో,
ఏ ముల్లోగుచ్చినట్టూంది..
నే పరుగాపాను... కాదు.. కాదు..
నే నడవలేకపోతున్నా..
కాని మనసులేని ప్రపంచం వెనుతిరిగి చూడలేదు..
అది నను ఒంటరిని చేసి వెళ్ళిపోతోంది..
నా దారులన్నీ ఇలా విడిపోయాఎమీ ?
నువ్వెక్కడ? - అని నా గమ్యం వెకిలిగా నవ్వుతున్నదేమీ
నా వ్యక్తిత్వం అలా నా నీడని వదిలి వేలుతున్నదేమి ?
నీవెవరు? - అని నా మనో రూపం హేళనగా చుస్తున్నదేమీ
ఆ ప్రపంచం వదిలిన నీలి నీడన
నే స్తానువునయ్యాను..
కానీ, అలుపులేని ఆ ప్రపంచం
ఇంకా పరుగెడుతూనే ఉంది..
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
నిజమే ! ప్రపంచం పరుగెడుతుంది. కాలం కొంగు పట్టుకుని. కనికరం లేక హృదయాలను కాలరాసుకుంటూ.
మహేష్,
నిజమే పరుగెత్తే ప్రపంచం ప్రక్కవాడి నెపుడూ జట్టు కలుపుకోదు. ఆగితే కాలమెక్కడ గెలుస్తుందో అన్న భయం కావచ్చు కదా?
హాయ్ శృతి మరియు ఆత్రేయ గారు..
మీరు చెప్పింది ఆక్షరాల సత్యమండి..
కాలంతో పోటి పడుతూ పరుగెత్తుతున్న ప్రపంచంతో జత కట్టలేక అలసిన మనసుతో రాసాను..
Keep visiting my blog, and suggest me for improvement.
Excellent.. keep it up..
Really excellent.....no words to praise u.....
hmmmm y end this in a sad note..? Closing it positively would be better.. like..
పరిగేడుతున్నంత సేపు నేనలోచించలేదు నా వెనకవారిగురించి ..
రా నేస్తం వెళ్లి కళ్ళెం వేద్దాం ఈ పరిగెత్తే లోకానికి..
@Sagar.. hahaha.. good try and nice extension..
Post a Comment