నీ కురులపై జాలువారిన ఆ నక్షత్రం,
నీ మోముపై చేరి పసిడి కాంతులీనేను..
ఎర్రని నీ అధరాలపై మోజుపడిన ఆ పసిడి భ్రమరం,
ఆ తేనెల మధువులో జలకాలడెను..
ఆ మత్తు ఏ గమ్మత్తు చేసెనో,
నీ ఎదపైకి చేరిన ఆ నర్తకి,
గుండె సవ్వడికి లయబద్దంగా శృంగార నాట్యమాడెను..
నీ ఎదపైకి చేరిన ఆ నర్తకి,
గుండె సవ్వడికి లయబద్దంగా శృంగార నాట్యమాడెను..
నీ గుండె తలపులు తనలో ఏ వేడి పుట్టించెనో,
ఆ తేనేల దొంగ నీ నడుమోంపున చేరి సేద తీరెను..
నీ క్రీగంట కొన చూపుని తప్పించుకోలేని ఆ నీటిబిందువు,
నీ పాదాలపైకి జారి కొంటెగా నవ్వుతూ ముద్దాడెను...
ఆ నవ్వున ఏ భావము దాగెనో కదా..?
నీ అందాలని ఆస్వాదించానన్న గర్వమా..?
లేక తనను పునీతం చేసావన్నఆరాధనా..?
4 comments:
wowwwwwwww! mahesh ! superb!
Chala bagundi ra..
Keep it up...
Really superb Mahesh. chaalaa adbhutamgA cheppAru.
There should be a LIKE button maggi. Its make life so simple.. ha ha:) anyways a beautiful one...
Post a Comment