నా కలల చీకటిని తరమగా,
ప్రమిదవై వస్తావో.. లేక,
ఆ కలలనే దహించగా,
ప్రలయాగ్నివై వస్తావో.. ?
నా మనసును సేద తీర్చగా,
పిల్లతెమ్మరై వస్తావో.. లేక,
ఆ గుండె గూడునే కూల్చే,
సుడిగాలివై వస్తావో.. ?
నా ఆశలకు జీవం పోయగా,
వర్షపుచినుకై వస్తావో.. లేక,
ఆ ఆశల వేరునే కబళించే,
జడివానవై వస్తావో.. ?
నా బ్రతుకు నావని దరికి చేర్చగ,
నిశ్చల సంధ్రమవుతావో.. లేక,
ఆ నావని నిలువునా ముంచే,
కెరటమవుతావో.. ?
నా అడుగుకు ప్రతి అడుగు కలిపగా,
నీడవవుతావో.. లేక,
ఆ నీడనే సమాధి చేసే
సమిధవవుతావో.. ?
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
మహేష్ !ఆ మధ్య నువ్వు తీసుకున్న దాదాపు రెండు నెలల గాప్ లో ఏం చేశావో ,ఏం తిన్నావో ...........చెప్పవా .....plz.....................అద్భుతంగా రాస్తున్నావ్ .
భలేవారే, అన్ని ప్రశ్నలడిగీ, అన్ని సందేహాలు వ్యక్తం చేసి చివరికి
"నా తోడూ రావా ప్రియా.. !!"
అని వేడుకున్నారన్న మాట! భలే చిత్రం, కాని విచిత్రం కాదు, ఎందుకంటే ప్రేమలోని మాయ అదే. అచ్చంగా ఇలాగే పలికిస్తుంది.
ఇంతలా రాస్తే రాకుండా ఉంటుందా చెప్పండి .....
మీ ప్రియ!!!
super boss adiriyi mee kavitalu, keka, keep writing
మనసు పలికే భాష మౌనం అని జీవితమంతా మౌనంగా ఉంటామ?
Hey the above is in no way related to what u wrote.. just a thought..;)
Post a Comment