Saturday, February 28, 2009

నీ తోడూ !! (U R my LIFE)

నా కలల చీకటిని తరమగా,
ప్రమిదవై
వస్తావో.. లేక,
కలలనే దహించగా,
ప్రలయాగ్నివై వస్తావో.. ?

నా
మనసును సేద తీర్చగా,
పిల్లతెమ్మరై వస్తావో.. లేక,
గుండె గూడునే కూల్చే,
సుడిగాలివై
వస్తావో.. ?

నా ఆశలకు జీవం పోయగా,
వర్షపు
చినుకై వస్తావో.. లేక,
ఆశల వేరునే కబళించే,
జడి
వానవై వస్తావో.. ?

నా బ్రతుకు నావని దరికి చేర్చగ,
నిశ్చల సంధ్రమవుతావో.. లేక,
నావని నిలువునా ముంచే,
కెరటమవుతావో.. ?

నా అడుగుకు ప్రతి అడుగు కలిపగా,
నీడవవుతావో..
లేక,
నీడనే సమాధి చేసే
సమిధవవుతావో
.. ?

Wednesday, February 25, 2009

నీ అందాలను తడమగా, ఎంత అదృష్టమో కదా..? (Lucky Drop)

నీ కురులపై జాలువారిన ఆ నక్షత్రం,

నీ మోముపై చేరి పసిడి కాంతులీనేను..

ఎర్రని నీ అధరాలపై మోజుపడిపసిడి భ్రమరం,
ఆ తేనెల మధువులో జలకాలడెను..

ఆ మత్తు ఏ గమ్మత్తు చేసెనో, 
నీ ఎదపైకి చేరిన నర్తకి,
గుండె సవ్వడికి లయబద్దంగా శృంగార నాట్యమాడెను..

నీ గుండె తలపులు తనలో ఏ వేడి పుట్టించెనో,
ఆ తేనేల దొంగ నీ నడుమోంపున చేరి సేద తీరెను..

నీ క్రీగంట కొన చూపుని తప్పించుకోలేని నీటిబిందువు,
నీ పాదాలపైకి జారి కొంటెగా నవ్వుతూ ముద్దాడెను...

ఆ నవ్వున ఏ భావము దాగెనో కదా..?
నీ అందాలని ఆస్వాదించానన్న గర్వమా..?
లేక తనను పునీతం చేసావన్నఆరాధనా..?

నీ పేరు!!

నీ పేరు తలిచినంతనే,
నా కళ్లు చెమర్చనే !
కన్నీళ్ళని నే దాచినా,
గుండె ఉప్పెనని నే ఆపలేకున్నా!!

ఏ నోట నీ పేరు పలికిన,
అది నీ సొంతమని..
నా మనసు మౌనంగా,
నాతో పోరుపెడుతున్నది..
నా పెదవులపై నే అద్దుకున్న
నా చిరు నవ్వు.. !
ఆ ఉప్పెనని, ఈ పోరుని
గెలవలేక పాలి(రి)పోతున్నది.. !!

Wednesday, February 18, 2009

ప్రపంచం పరుగెడుతోంది !! (Lost in this WORLD)

పరుగుల ప్రపంచం పరుగెడుతోందీ..
నేనూ పరుగెడుతున్నాను...
రంగుల లోకం కొంగొత్త రంగులు పులుముకుంటోంది..
నేను ఆ రంగులూ పులుముకొన్నాను..
కాలం వంకలో మలుపులన్నీ తిరుగుతోందీ,
నేను ఆ మలుపుల్లో చేరాను..


ప్రపంచం పరుగెడుతూనే ఉంది..
నేను పరుగెడుతూనే ఉన్నాను..


ఆ మలుపుల్లో,
ఏ ముల్లోగుచ్చినట్టూంది..
నే పరుగాపాను... కాదు.. కాదు..

నే నడవలేకపోతున్నా..

కాని మనసులేని ప్రపంచం వెనుతిరిగి చూడలేదు..
అది నను ఒంటరిని చేసి వెళ్ళిపోతోంది..


నా దారులన్నీ ఇలా విడిపోయాఎమీ ?
నువ్వెక్కడ? - అని నా గమ్యం వెకిలిగా నవ్వుతున్నదేమీ
నా వ్యక్తిత్వం అలా నా నీడని వదిలి వేలుతున్నదేమి ?
నీవెవరు? - అని నా మనో రూపం హేళనగా చుస్తున్నదేమీ


ఆ ప్రపంచం వదిలిన నీలి నీడన
నే స్తానువునయ్యాను..
కానీ, అలుపులేని ఆ ప్రపంచం
ఇంకా పరుగెడుతూనే ఉంది..

నీ జ్ఞాపకం !! (Walking with Your Memory)

నా చేతిలోన నీ చేయి లేదు..
అయినా, నా దారి మారలేదు..

నా అడుగులకి నీ పాదాల తోడూ లేదు..
అయినా, నా నడక ఆగలేదు..

నా కనుపాపకి నీ రూపు చూపు లేదు..
అయినా, ఆ వెలుగు తగ్గలేదు..

నా మాటలకి నీ నవ్వుల ఝరి లేదు..
అయినా, నా పెదవి ముడుచుకోలేదు..

నీవు నిజమై నను కరునించకున్నా,
జ్ఞాపకమై నను మురుపిస్తున్నావే, ప్రియా.

Tuesday, February 17, 2009

నీ రూపుతో చెలిమి !!

ఉషోదయంతో చెలిమి,
వేకువలో వెచ్చదనం నింపేనూ..


తామరాకుతో చెలిమి,
మంచుబిందువిని ముత్యంగా మలిచేనూ..

చిరుగాలితో చెలిమి,
మల్లియను పరిమళంతో పలకరించేనూ..

సాయంకాలంతో చెలిమి,
సూర్యున్ని చల్లదనంతో తడిమేనూ..

నీ రూపుతో చెలిమి,
నా గుండెను నీ బందీని చేసేనేలా, ప్రియా ?

శంఖారావం !!




ఏ అవరోధం నిలువరించేనూ,
జలపాతపు హొరునీ...
ఏ కడలి కెరటం ఆపెనూ,
అనువుగా సాగే నావ పయనాన్నీ...
ఏ దూరం నిలిచేనూ,
కదిలే కాలి అడుగునా...
ఏ చీకటి మింగేనూ,
చీల్చే కిరణపు వెలుగునీ...
ఏ భారం అనిచేనూ,
మొలకెత్తే విత్తనపు సంకల్పాన్నీ...


ఇది గెలుపు కోసమై,

ఓటమి ఆరాటపు పోరాటం.. !
ఇది నిరాశాపై,
ఆశ పూరిస్తున్న సమరపు శంఖారావం...!!

Monday, February 16, 2009

వేచి యున్నాను నీ కోసం !!

అణువణువు..
నాలో ప్రతి అణువూ...
అణువణువు..
నాలో ప్రతి మనసై...
వేచేనిలా, తనువంతా నయనాలై !

నీ కోపమే,
నను కాల్చే తాపమై..
నీ కనుమరుగే,
నను కప్పెను శూన్యమై..
కనరావా.. క్షమించలేవా.. ఓ ప్రియా ?

నీ వేదనే,
నను అనిచే భారమై..
నీ కన్నీరే,
నను ఓడించెను శాపమై..
వినరావా... దరి చేరవా... ప్రియా ?

అణువణువు..
నాలో ప్రతి అణువూ...
అణువణువు..
నాలో ప్రతి మనసై...
విలపించేనిలా, తనువంతా గాయాలై.. !!
----------- Small Info -----------
My fren, Purushottam Reddy asked me to experiment, by writing a song :). And it is his Subject, "Guy saying Sorry to the Gal and waiting for her". Here, I just tried but cudn't get so much to make it a song. Hope, it gives a feeling of stanza or a bit song ;)

Saturday, February 14, 2009

గమ్యం !!

దారి లేని గమ్యం నా దరి చేరదని
ఎద పొరల్లో దాగిన ఊహల బ్రమరాలని
ఒడసి పట్టి ఒక్క చోట చేర్చితిని.

ఆచరణపు దబ్బనంలో
నేర్పు అనే దారమెక్కించి
ఆశయాల తివాచి అల్లితిని.

అడుగులో అడుగువేస్తూ
ఆ తివాచిపై నడక నేర్చి
ఆ నడకకు కోరికల వడి కలిపి
పరుగులు నేర్పితిని.

నా కోరికల బరువును తాళలేక
కుదేలైన ఆ దారం తివాచిపై
చిరుగుల రాళ్ళను పరిచెను.

అల్లికలో పొరపాటు ఏమోనని వెనుతిరిగిన నేను
నడిచిన దారిన వికసించిన పూలు
కోరికల పరుగున చిరుగుల రాళ్ళు చూసి
కృంగిన మనసు వేదనతో విలపించెను.

ఆ ఆశ్రు ధారలో
నా ఊహల గులాబిలతో చెలిమి చేసిన
కోరికల ముళ్ళు ఒక్కొక్కటిగా రాలి
చిగురుటాకులా ఆశ చిగురించేను.

ఓర్పు అనే గంజితో వడికిన దారంతో
క్షమాపణల అతుకులేస్తూ
గమ్యం వైపు సాగుతున్న
అనుభవపు బాటసారిని
నేనిప్పుడూ.. !!

పిచ్చి ప్రేమ !!

ఏది మొదలు.. ఏది చివరా.. ?
ఆద్యంతాలు లేని అనంతమీ ప్రేమ.. !

ఏది జననం.. ఏది మరణం.. ?
జననమరనాలేరుగని అమరమీ ప్రేమ.. !!

ఏది గెలుపు.. ఏది ఓటమీ.. ?
గెలుపోటముల సవాలులేని సయోద్యే ఈ ప్రేమ.. !!!

ఏది ఎడబాటు.. ఏది చెంత..?
విరహపుచెంత కుసిమించే వలపే ఈ ప్రేమ.. !

ఏది నిజం.. ఏది అబద్దం..?
సత్యాసత్యాల చర్చే లేని నమ్మకమే ఈ ప్రేమ.. !!


- - - - - - - - Just for fun - - - - - - - -
contd ....

ఏది పిచ్చి.. ఏది ప్రేమ..?
పిచ్చియే ప్రేమ.. ప్రేమయే పిచ్చి.. ఇదో పిచ్చి ప్రేమ :)

Friday, February 13, 2009

నాలో నువ్వు !!

నా వూపిరిలోని గాలిలో, నీ శ్వాశ వెచ్చదనం నింపెను..
కనుల కలల తీరపు నిశీదిన, నీ రూపు జ్యోతిలా వెలిగెను..
నే పలికే ప్రతి పదమున, నీ గత స్మృతులే జతకలిసేను..
వినిపించే ప్రతి సవ్వడిలో, నీ మాటల గలగలలే జాలువారెను..
ఏమీ ఈ పిచ్చిదనమని,
నను నేను తడిమి చూడగా, ఆ స్పర్శన నువ్వే చేరావు.. !!

రాసాను మన పేర్లు ..... !!

మనిద్దరి పేర్లు
ఇసుకలో రాయలేదు,
అదుపులేని సముద్రపు అల చేరిపేస్తుందేమోనని...

ఏ రాయిపై చెక్కలేదు,
మనసేలేని రాయి మరిచిపోతుందేమోనని...

ఆ మబ్బులపై చిత్రీకరించనూలేదు,
నిలకడలేని మబ్బు వర్షపు మేఘమవుతుందేమోనని...

మరుపే తెలియని గురుతుగా నిలవాలని,
నా హృదయస్పందనలో నింపాను ప్రియతమా ...!!

Wednesday, February 11, 2009

నీ తోడూ లేక ... !!

నింగి విరుగుతున్నా,
ఆ భీకర శబ్దం నాకు వినపడదేమి ?
భూమి కంపిస్తున్నా,
ఆ కంపన నాలో చలనం కలిగించదేమి ?
గాలి భరువెక్కుతున్నా,
ఆ పీడనం నా gundeni mukkalu చేయదేమి ?
(ఎద) సంద్రం పొంగుతున్నా
ఆ తడి నా కనులను తాకదేమి ?
నను నిలువునా దహించుతున్న (నీ పేరు),
ఆ వేడి naa naalukanu kaalchademi ?

ఆ పంచభూతాలకి, నా ఈ పంచెంద్రియాలపై ఇంత ప్రేమెందుకో ?
నీవు నా తోడూ లేవన్న జాలితోనా !!

Monday, February 9, 2009

ప్రేమికుల రోజు - 2 !!

ఆకులన్ని రాల్చిన తరులు,
నీ రాకతో కొత్త రూపుకు శ్రీకారం చుట్టాలనీ.. !
మూగబోఇన కోకిల,
తన గొంతుకు నీ ఆగమన మాధుర్యాన్ని జత చేయాలనీ.. !!

కొత్త కొత్తగా పరిచయమవుతున్న లోకంలో,
నీవిచ్చే అండతో ముందడుగు వెయ్యాలని ఆరాటపడే యవ్వనము.. !
చేతిలోన గులాబి,
గుండెలోన తుంచలేని ఆ పూవు దరహాసపు ఆశతో.. !!
కొత్తగా ముస్తాబై వస్తావని నీ కోసం ఎదురు చూస్తూ.. !!! ;)

Sunday, February 8, 2009

ప్రేమికుల రోజు !!

ప్రేమికుల రోజు!!
మళ్లీ రానే వస్తుంది..

నాలో దాగున్న విరహపు వేదనకి విహంగాల తోడునిచ్చి,
రేపిన ఆ జ్వాల యందు నా మనసు కాలుతుంటే,
వెర్రిగా నవ్వుతూ, చలి కాచుకోడానికి రానే వస్తోంది.. !

నీ ఆలోచన

నీ మొదటి ఆలోచన నా మదిని తాకినప్పుడు,
అది నా ఆలోచన ప్రవాహంలో కొట్టుకొచ్చిన అల ఏమో అని,
అన్ని అలల్లాగే అది కూడా ఎగసి పడుతుందిలే అనుకున్నాను..

ఆ రోజు నిను చూసినప్పుడు, నా గుండెలో తెలియని అలజడి..
నీవు నా ఎదురుగ, నేను నీ ఎదురుగ..
నీవు నన్ను చూడలేదు అని నే అనుకున్నా..
(కాని అమ్మాయి కళ్లు కొనచూపులో ప్రపంచాన్ని చుట్టేయగలవు అని తెలియలేదు..)
నీ వైపు చూడాలన్న తహ తహ ఒక వైపు, తెలియని భయం మరో వైపు..
ఎలాగైనా మరొకసారి చూడాలన్న నా కనుల కోరిక ముందు,
నా గుండె సవ్వడి వినిపించలేదు..

నే చూసా!!
ఆహా, ఆ చూపు నా కనుపాపలకి అందాన్ని పంచితే,
ఆ కనుపాపలు నా పెదవులకి ఆనందాన్ని అరువిచ్చాయి..

ఇంతలోనే నా కళ్లు నీ చూపుల తాకిడికి ఎర్రబడ్డాయి..
అప్పుడు నా గుండె సవ్వడి నే గెలుస్తున్నానన్న సంకేతాలని పంపుతూ ఉంది....
ఆ నీ చూపు, కోపంగా చూసిన ఏదో ఒక తెలియని చల్లదనపు అనుభూతిని మిగిల్చి,
రోజు ఇలా నా హృదయాన్ని తాకుతూనే ఉంది..

ఆ అలకి అలుపు రాదేమో..
సరే, పోనీలే అని వూరుకుందామంటే, అది అన్నింటిని ముంచేస్తోంది..

Saturday, February 7, 2009

స్త్రీ - పురుష !!

నిను చెరాలనే,
నా తలపు ఉవ్వెత్తున ఎగసి,
ఆ తలపే తపనై, తపనే వేగమై..

నను నేను మరిచి (మార్చుకొని),
ఉరుకు పరుగున,
దాటిన కొండ కోనలు.. తిరిగిన వేల మలుపులు..

నిను చేరినంతనే, నీ గర్జన ముందు చిన్నబోయెను ఆ ఆనందపు పరవళ్ళు..
నీ నీడన కనుమరుగాయేను నా ఆనవాళ్ళు ..!!