నీ మొదటి ఆలోచన నా మదిని తాకినప్పుడు,
అది నా ఆలోచన ప్రవాహంలో కొట్టుకొచ్చిన అల ఏమో అని,
అన్ని అలల్లాగే అది కూడా ఎగసి పడుతుందిలే అనుకున్నాను..
ఆ రోజు నిను చూసినప్పుడు, నా గుండెలో తెలియని అలజడి..
నీవు నా ఎదురుగ, నేను నీ ఎదురుగ..
నీవు నన్ను చూడలేదు అని నే అనుకున్నా..
(కాని అమ్మాయి కళ్లు కొనచూపులో ప్రపంచాన్ని చుట్టేయగలవు అని తెలియలేదు..)
నీ వైపు చూడాలన్న తహ తహ ఒక వైపు, తెలియని భయం మరో వైపు..
ఎలాగైనా మరొకసారి చూడాలన్న నా కనుల కోరిక ముందు,
నా గుండె సవ్వడి వినిపించలేదు..
నే చూసా!!
ఆహా, ఆ చూపు నా కనుపాపలకి అందాన్ని పంచితే,
ఆ కనుపాపలు నా పెదవులకి ఆనందాన్ని అరువిచ్చాయి..
ఇంతలోనే నా కళ్లు నీ చూపుల తాకిడికి ఎర్రబడ్డాయి..
అప్పుడు నా గుండె సవ్వడి నే గెలుస్తున్నానన్న సంకేతాలని పంపుతూ ఉంది....
ఆ నీ చూపు, కోపంగా చూసిన ఏదో ఒక తెలియని చల్లదనపు అనుభూతిని మిగిల్చి,
రోజు ఇలా నా హృదయాన్ని తాకుతూనే ఉంది..
ఆ అలకి అలుపు రాదేమో..
సరే, పోనీలే అని వూరుకుందామంటే, అది అన్నింటిని ముంచేస్తోంది..
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
మీ కవిత బహు బాగు.....
మీరు ఆలోచనల్లో మునిగిపోకుండా
అప్పుడప్పుడు ఇలా కవితలు వ్రాయండి...
hmm.. sure :). Thanks a lot for ur encouragement..
:)
బాగా రాసారు
Thanks Mahita :)
Post a Comment