Tuesday, February 17, 2009

నీ రూపుతో చెలిమి !!

ఉషోదయంతో చెలిమి,
వేకువలో వెచ్చదనం నింపేనూ..


తామరాకుతో చెలిమి,
మంచుబిందువిని ముత్యంగా మలిచేనూ..

చిరుగాలితో చెలిమి,
మల్లియను పరిమళంతో పలకరించేనూ..

సాయంకాలంతో చెలిమి,
సూర్యున్ని చల్లదనంతో తడిమేనూ..

నీ రూపుతో చెలిమి,
నా గుండెను నీ బందీని చేసేనేలా, ప్రియా ?

4 comments:

పరిమళం said...

నీ కవితతో మమ్ము ముగ్ధుల్ని చేసేవిలా.............

శ్రుతి said...

చెలిమితో చెలిమి చేసిన
నీతో నా చెలిమి
చెలిమికే చెలిమై వెలిగేనిలా
స్నేహ మకరందానికే సుగంధంలా

మహేష్! చాలా బాగున్నాయి మీ భావాలు. ఎంత అంటే ఇంత అని చెప్పలేనంత.

Unknown said...

Wow MAhesh,
Entha baga rasav,chala bagunnai anni kavithalu...
all the best..u can do it still better

Chitra

Sagar said...

జాబిలితో చెలిమి నీ రూపుని నా దరికి చేర్చెను

నీ రూపుతో చెలిమి,
నా గుండెను నీ బందీని చేసేనేలా, ప్రియా ?
How about adding tht in between. Hey all the comments are just my thoughts.. U definitely dont need to think ( the other way) abt them.. okie??