Monday, February 9, 2009

ప్రేమికుల రోజు - 2 !!

ఆకులన్ని రాల్చిన తరులు,
నీ రాకతో కొత్త రూపుకు శ్రీకారం చుట్టాలనీ.. !
మూగబోఇన కోకిల,
తన గొంతుకు నీ ఆగమన మాధుర్యాన్ని జత చేయాలనీ.. !!

కొత్త కొత్తగా పరిచయమవుతున్న లోకంలో,
నీవిచ్చే అండతో ముందడుగు వెయ్యాలని ఆరాటపడే యవ్వనము.. !
చేతిలోన గులాబి,
గుండెలోన తుంచలేని ఆ పూవు దరహాసపు ఆశతో.. !!
కొత్తగా ముస్తాబై వస్తావని నీ కోసం ఎదురు చూస్తూ.. !!! ;)

2 comments:

పరిమళం said...

మహేష్ !ఇంతవరకూ అనావృష్టి ?ఇంతలోనే అతి వృష్టి ?వావ్ !!superb!

Mahesh said...

Thanks :)