Saturday, February 14, 2009

గమ్యం !!

దారి లేని గమ్యం నా దరి చేరదని
ఎద పొరల్లో దాగిన ఊహల బ్రమరాలని
ఒడసి పట్టి ఒక్క చోట చేర్చితిని.

ఆచరణపు దబ్బనంలో
నేర్పు అనే దారమెక్కించి
ఆశయాల తివాచి అల్లితిని.

అడుగులో అడుగువేస్తూ
ఆ తివాచిపై నడక నేర్చి
ఆ నడకకు కోరికల వడి కలిపి
పరుగులు నేర్పితిని.

నా కోరికల బరువును తాళలేక
కుదేలైన ఆ దారం తివాచిపై
చిరుగుల రాళ్ళను పరిచెను.

అల్లికలో పొరపాటు ఏమోనని వెనుతిరిగిన నేను
నడిచిన దారిన వికసించిన పూలు
కోరికల పరుగున చిరుగుల రాళ్ళు చూసి
కృంగిన మనసు వేదనతో విలపించెను.

ఆ ఆశ్రు ధారలో
నా ఊహల గులాబిలతో చెలిమి చేసిన
కోరికల ముళ్ళు ఒక్కొక్కటిగా రాలి
చిగురుటాకులా ఆశ చిగురించేను.

ఓర్పు అనే గంజితో వడికిన దారంతో
క్షమాపణల అతుకులేస్తూ
గమ్యం వైపు సాగుతున్న
అనుభవపు బాటసారిని
నేనిప్పుడూ.. !!

4 comments:

Padmarpita said...

నీ బాట పూలబాట కావాలని ఆశ్శిస్తున్నాను....

Mahitha said...

అర్థం చేసుకోవటం కొంచెం కష్టం అయింది నాకు.

:(


చిగురాకుల సవ్వడి వింటూ
మంచు పూల నవ్వులు చూస్తూ
వెన్నెల మెట్లు ఎక్కుతున్నాను.

:)

శ్రుతి said...

దారిలేని గమ్యం నీదరి చేరదని
చేరదు నేస్తం
కాని గమ్యం తెలిసిన మనసు
చేరెను నిన్నెపుడో

నేర్పు దారం కూర్చిన ఆచరణపు దబ్బనం
అల్లిన తివాచి
అడుగుల బరువెంతైనా అరగదు కొంతైనా
మరువకిది నేస్తం

అశృధారల వడిలో విరిగిన ముల్లు చేరువ
చేసేను గులాబీని
చిగురించిన ఆశలు రేపటి రోజుకు తొడిగిన
మొగ్గలు, వికసించనీ నేస్తం!

Mahesh said...

suPadma, Shruti..
Chaala thanks :)

Mahi, konchem modify chesa.. meeru confuse ayyaremo ani.. ippudu choodandi.. :)